1 July, 2026 | 8:40 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం

01-07-2026 07:29 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ​శాతవాహన విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యా ప్రమాణాల దిశగా ఒక కీలక అడుగు వేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ 'ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌'తో శాతవాహన విశ్వవిద్యాలయం అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉభయ విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు పరిశోధనలు, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం పెంపొందనున్నాయి.

​ ఆచార్య ఉమేష్ కుమార్  మాట్లాడుతూ ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో కుదిరిన ఈ అవగాహన ఒప్పందం శాతవాహన విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ భాగస్వామ్యం ముఖ్యంగా పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఇక్కడి విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ​విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉప కులపతికి  రిజిస్ట్రార్  సతీష్ కుమార్, ఓ ఎస్ డి టు వీసీ డా. హరికాంత్, డీన్స్, ప్రిన్సిపాల్స్,విశ్వవిద్యాలయ అధికారులు,  అధ్యాపక బృందం, భోదనేతర సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.