ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోంది: ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
తాడూరు / తెలకపల్లి జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడూరు, తెలకపల్లి మండల కేంద్రాల్లో, యాదిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం తెల్కపల్లి మహిళా సమాఖ్య కేంద్రాన్ని ప్రారంభించి, మహిళల సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి అర్హత గల కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాకుండా కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసా కల్పించే శాశ్వత ఆస్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






