మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్నేహ సంఘాల బాలికలకు క్రీడలు
02-06-2026 02:05 AM
అయిజ, జూన్ 1: అయిజ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆఫీసు నందు స్నేహ సంఘాల బాలబాలికలకు క్రీడోత్సవాలు ఇంచార్జ్ ఏపిఏం జయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయాకర్ మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలు శారీరక, మానసిక దృఢత్వం కోసం ఆటల పోటీలు ఉండాలనే ఉద్దేశ్యంతో క్రీడలను నిర్వహించామని అన్నారు.
ఈ క్రీడలలో బాలికలకు కబడ్డీ, ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించామని విజేతలైన వారికి జూన్ రెండవ తేదీన తెలంగాణ దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సేర్ఫ్ సిబ్బంది సుదర్శనం, ఆంజనేయులు,మొదలగువారు పాల్గొన్నారు.






