20 August, 2026 | 2:17 AM

పాలిటెక్నిక్‌లు ప్రైవేట్‌కు!

20-08-2026 01:39 AM

స్వయంప్రతిపత్తి కోల్పోనున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు

  1. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్‌లు 
  2. శక్తి శాఖ పరిధిలోకి ఉద్యోగులు 
  3. హడావిడిగా జీవో విడుదల

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఓ నిర్ణయం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో నెట్టిపడేసింది. ఇప్ప టివరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన పాలిటెక్నిక్ విద్యాసంస్థలు కొత్త విధానం అమల్లోకి వస్తే పరోక్షంగా ప్రైవేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యామండలి (స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ రెండు విభాగాల్లోకి కలపనున్నారు.

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, ఏటీసీలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి, ఉద్యోగులను శక్తి (కార్మిక) శాఖ పరిధిలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నిర్ణయంతో సాంకేతిక విద్యామండలి భవిష్యత్తు రానున్న రోజు ల్లో నిర్వీర్యం కానున్నదనే విమర్శలు వినిపిస్తున్నారు.

అసలు ఏకపక్షంగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా పాలిటెక్నిక్ కాలే జీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం ఎలా చేస్తారంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ఇది సాంకేతిక విద్యా మండలి స్వయంప్రతిపత్తిని తీవ్రంగా దెబ్బతీసే చర్యగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.

ప్రభుత్వ శాఖను పీపీపీ వ్యవస్థకు అప్పగించడమా?

పూర్తిస్థాయి ప్రభుత్వశాఖను పబ్లిక్ -ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నడిచే స్కిల్ యూనివర్సిటీకి అప్పగించడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుంటే, 54 ప్రైవేట్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం గా దాదాపు 32 వేల వరకు సీట్లు ఉన్నా యి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఈ మార్గాన్ని క్లిష్టతరం చేసినట్లే. ఇప్పటి వరకు వీటి పరీక్షలు, అడ్మిషన్ల వ్యవహారాలను సాంకేతిక విద్యామండలినే పర్యవేక్షించేది. కొత్త కోర్సులు, సిలబస్ రూపకల్పన అన్నింటిని ఇదే చూస్తోంది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97 ద్వారా కొత్త విధానం అమల్లోకి వస్తే సాంకేతిక విద్యామండలి పరిధిలో ఇవేవి ఉండవు. బోర్డు స్వయం ప్రతిపత్తిని కోల్పోతుంది. ఇవి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తాయి. ఉద్యోగులు, సిబ్బంది కూడా శక్తి (కార్మిక శాఖ) పరిధిలోకి వెళ్తారు.

భవిష్యత్తులో న్యాయపరమై చిక్కులూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అయినా పబ్లిక్-ప్రైవేట్ -పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో నడిచే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వీటిని తీసుకురావడమంటే పాలిటెక్నిక్‌లను పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పెట్టడమే అవుతోంది. కాలేజీల అనుమతులు, పరీక్ష లు, అడ్మిషన్లు, సిలబస్, ఫలితాలు, ఉద్యోగులు లాంటి అంశాలపై నిర్ణయాలు వారే తీసుకునే వీలుంది.

ఇష్టానుసారంగా నిర్ణయాలు..

సాంకేతిక విద్యామండలి విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీ సుకుంటుందనే విమర్శులన్నాయి. గతంలో నూ తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసులు చేస్తూ...పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరే ల్యాటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలను తేవాలని సిఫార్సు చేసింది.

పాలిటెక్నిక్ విద్యార్థులను ఇంటర్ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, ఏకంగా రెండో సంవత్సరంలో కాకుండా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే వారికి అడ్మిషన్లు కల్పించాలని పలు సిఫార్సులు చేసింది. మరోవైపు సాంకేతిక విద్యామండలిని విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది.

కానీ, ఆ తర్వాత కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ పరిధిలో నడుస్తున్న ఈ యూనివర్సిటీని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని కూడా ప్రభుత్వం చెప్పినప్ప టికీ ఆ దిశగా ముందడుగు పడలేదు. తాజా గా పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని ప్ర భుత్వం నిర్ణయించింది. 

విలీనం చేద్దామా వద్దా?

క్యాబినెట్ సమావేశం అయిన దగ్గర నుంచి పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చే యొద్దని ఒకవైపు విద్యార్థులు, విద్యార్థి సం ఘాలు, మరోవైపు తమను శక్తి కార్మిక శాఖ పరిధిలోకి చేర్చొద్దని, సాంకేతిక విద్యామండలిని యథావిధిగా కొనసాగించాలని అధ్యాపకులు, ఉద్యోగులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాలేజీల మందు విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం ప్రక్రియపై పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ల