అవినీతిఫై ఇక సమరభేరి
జెన్- జీ, జెన్ -ఆల్ఫాలు నడుం బిగించాలి
చారిత్రక అవసరం
* పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. లేకపోతే ఆ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో యువత ముందుకు రావాలి. కుళ్లిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. యువతలో ఉన్న ఆవేశం అరాచకానికి దారితీయకూడదు. అది ఒక క్రమశిక్షణతో కూడిన విప్లవంగా మారాలి..
- రామ్ మనోహర్ లోహియా
* ఎన్నికల వ్యవస్థలో చొరబడిన ధనప్రభావం ప్రజాస్వామ్య మూలాలనే పెకలించివేస్తోంది. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో ఓట్లు దండుకుని, ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. ఇక తాము ఎవరికీ జవాబుదారీ కాదనే అహంకారంతో పార్టీలు అవినీతికి, అక్రమాలకు తెగబడు తున్నా యి. ఉదాహరణకు, ఒక సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, ఎంత లోతుకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
* ఓటుకు నోటు సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఎన్నికల సమయంలో లంచాలుగా ఇచ్చే నగదు, బహుమతులను పూర్తిగా తిరస్కరించాలి. ఇందుకు యువత నడుం బిగించాలి. అలాగే అవినీతి రహిత భారత్ కోసం.. భారత దేశాన్ని రక్షించేందుకు యువ తరం ఉద్యమించక తప్పని పరిస్థితి కనపడుతోంది. వివిధ పథకాల్లో ప్రభుత్వ నిధుల కేటాయింపులు, టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న గోల్‌మాల్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు తీసి, సామాజిక మాధ్యమాల్లో ప్రజా తీర్పుకు ఉంచాలి.
భారతదేశం ఎటువైపు పయనిస్తోంది? ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజూ ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా.. అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. పాలనలో పారదర్శకత లోపిం చింది. అన్ని వ్యవస్థలూ వైఫల్యం చెందా యి. సామాన్యుడి హక్కులు కాలరాస్తున్నా రు. ఈ తరుణంలో.. ఈ అరాచక వ్యవస్థను ప్రశ్నించే బాధ్యత ఎవరిది? ఎవరు ఈ దేశాన్ని అవినీతి రహితంగా చేసి భారత్‌ను రక్షించాలి? అనే ప్రశ్నకు సమాధా నంగా.. జెన్ జీ, జెన్ ఆల్ఫాలే వినపడుతున్నాయి. కనపడుతున్నారు.
నేటి నవతరం ఈ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు కేవలం విద్యాహక్కులు, ప్రశ్నా పత్రాలు, ఉద్యోగాలు, భావప్రకటన స్వేచ్ఛ పై తమ నిరసన గళాన్ని వినిపించిన ‘జెన్- జీ’, ‘జెన్ -ఆల్ఫా’ తరం, ఇకపై దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై నేరుగా సమరభేరి మోగించాల్సి అత్యవసరం ఎంతైనా ఉంది.
కండ్లముందే అక్రమాల రాజ్యం..
ఎన్నికల వ్యవస్థలో చొరబడిన ధనప్రభావం ప్రజాస్వామ్య మూలాలనే పెకలిం చివేస్తోంది. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో ఓట్లు దండుకుని, ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. ఇక తాము ఎవరికీ జవాబుదారీ కాదనే అహంకారంతో పార్టీలు అవినీతికి, అక్రమాలకు తెగబడుతున్నాయి.
ఉదాహరణకు, ఒక సాధారణ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, ఎంత లోతుకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. పునర్విభజన అనంతర అంచనాల ను పరిగణనలోకి తీసుకుంటే.. తెలంగాణలోనే దాదాపు 180 నియోజకవర్గాలు ఉంటాయని అంచనా. ఈ లెక్కన ఎన్నికలకు ఖర్చుచేసే సొమ్ము అక్షరాలా రూ. 18,000 కోట్లకు చేరుకుంటుంది.
వ్యాపార కోణంలో ఆలోచించే ఏ రాజకీయ నాయకుడైనా తాము వెచ్చించిన ఈ భారీ మొత్తానికి ఐదారు రెట్లు, పది రెట్ల వరకుకూడా వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒక్క రాష్ట్రంలోనే కేవలం రాజకీయాధికారం పేరుతో సుమా రు రూ. లక్ష కోట్ల అవినీతికి, అక్రమాలకు మార్గం వేసుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. ప్రజాసేవ స్థానంలో స్వార్థపూరిత ‘వ్యాపార నమూనా’ రాజ్యమేలుతుండటానికి ఈ లెక్కలే సజీవ సాక్ష్యాలు.
ఇది కేవలం ప్రభుత్వం ముసుగులో రాజకీయ పార్టీలు చేసే అవినీతి మాత్రమే. ఇక కిందిస్థాయి పంచాయతీ కార్యాలయం నుంచి మొదలుకుని.. రాష్ట్ర సచివాలయం వరకు జరిగే అవినీతికి అంతమే లేదు. లెక్కాపత్రంకూడా లేదు. దీనిని ఊహించనుకూడా ఊహించలేం. ప్రతిచోటా.. ఏ పని కావాలన్నా.. అమ్యామ్యాలు.. ఇవ్వాల్సిందే.
చేతులు తడపాల్సిందే. కిందిస్థాయి ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వర కు అవినీతి, అక్రమాలు, లంచగొండితనానికి పూర్తిగా బానిసలయ్యారు. ఇందుగల దందు సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. అందందే కలదు అవినీతి.. అన్న చందంగా పరిస్థితి మారింది.
వ్యవస్థల పతనం..
ఇంతలా అవినీతి, అక్రమాలు పెరగడానికి కారణం ఏమిటనే ప్రశ్న ఉదయించక మానదు. దేశం, సమాజం, ప్రజాస్వామ్యం సజావుగా నడవడానికి, ఎక్కడికక్కడ పర్యవేక్షణకు, నిఘాకు, చట్టం పరిధిలో చర్యల కు ఉద్దేశించిన, నిర్దేశించుకున్న వ్యవస్థలన్నీ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కార ణం. అవినీతి ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ బాధ్య తను విస్మరించడమే కారణం. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ప్రతి వ్యవస్థ నేడు లంచగొండితనంతో కుప్పకూలిపోతోంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తింది.
ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సంక్షే మం పేరుతో ఓటర్లను ఆకర్షించడం, ఆపై అక్రమ సంపాదనతో ప్రజాధనాన్ని లూటీ చేయడం నిత్యకృత్యమైంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ పరస్పర ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను పక్కనబెడుతున్నాయి. ఎవరికెంత లాభం అనే ధోరణి తీవ్రంగా ప్రబలింది. కార్యనిర్వాహక వ్యవస్థను నడిపిస్తూ.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ లాంటి ఉన్నతాధికారులు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు.
పోస్టింగు లు, బదిలీలు, సొంత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులతో అంటకాగుతున్నారు. దీనితో రాజకీయ నాయకుల అడు గులకు మడుగులొత్తుతూ అవినీతికి రాజమార్గాలు సిద్ధం చేస్తున్నారు. పైగా రాజ కీయ నాయకులకు ఏయే మార్గాల్లో రాబ డి ఉంటుందనే అంశాలనుకూడా నూరిపోస్తున్నారు. దీనితో మరింత అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది.
తనిఖీ ఏజెన్సీలు, న్యాయ వ్యవస్థలు కూడా వైఫల్యం చెందాయి. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునే సాధనాలుగా మారుతున్నాయి. న్యాయస్థానాల్లో కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యం నేరస్థులకు వరంగా మారుతోంది. అక్కడకూడా అవినీతి, లంచగొండితనం, రాజకీయ ప్రాబల్యం, కులా లు, మతాల ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.
వైఫల్యాలను బయటపెట్టాల్సిన మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. సమాజానికి అద్దం పట్టాల్సిన ఫోర్త్ ఎస్టేట్ (మీడియా) నేడు వ్యాపార ప్రయోజనాలు, పార్టీ రంగుల ఆధారంగా వార్తలను విశ్లేషిస్తూ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది. ప్రకటనలు, ప్రాబల్యం, సొంత ఆస్తుల కోసం అక్రమాలు, అవినీతికి వంతపాడాల్సి వస్తోంది.
డిజిటల్ యుగంలో నిరసన..
ఈ క్లిష్టమైన, దేశానికి ప్రమాదకరమైన సమయంలో సాంప్రదాయ రాజకీయ విమర్శలు, ధర్నాలు, ఉపన్యాసాల వల్ల వ్యవస్థలో పెద్దగా మార్పు రావడం లేదనేది అందరూ ఒప్పుకునే చేదు నిజమే. అయితే, ప్రస్తుత జెన్- జీ, జెన్- ఆల్ఫా తరాల వద్ద ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది.. అదే ‘సమాచార సాంకేతికత వ్యవస్థ.. అదే డిజిటల్ నెట్‌వర్కింగ్’. ఈ నవతరం ఆలోచనా విధానం గత తరా ల కంటే భిన్నంగా ఉంది. వీరు ఏ సిద్ధాంతానికీ అంథ భక్తులుగా ఉండటానికి ఇష్టప డటం లేదు.
సామాజిక మాధ్యమాలు, మీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా సత్యాన్ని క్షణాల్లో వెలుగులోకి తెచ్చే సామ ర్థ్యం వీరికి ఉంది. రాజకీయవర్గాలు ఉచిత పథకాల పేరుతో విసిరే ఎరలను, ఎంగిలిని తిరస్కరించి, మేము చెల్లించే పన్నుల సొమ్ము ఏమైంది?.. అభివృద్ధి పథకాల అంచనాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటూ.. అని నిలదీసే చైతన్యం ఈ తరంలోనే ఎక్కువగా ఉంది.
అవినీతిపై ఉద్యమం..
ఓటుకు నోటు సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఎన్నికల సమయంలో లంచాలుగా ఇచ్చే నగదు, బహుమతులను పూర్తిగా తిరస్కరించాలి. ఇందుకు యువత నడుం బిగిం చాలి. అలాగే అవినీతి రహిత భారత్ కోసం.. భారత దేశాన్ని రక్షించేందుకు యువ తరం ఉద్యమించక తప్పని పరిస్థితి కనపడుతోంది. వివిధ పథకాల్లో ప్రభుత్వ నిధుల కేటాయింపులు, టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న గోల్‌మాల్‌ను సమా చార హక్కు చట్టం ద్వారా బయటకు తీసి, సామాజిక మాధ్యమాల్లో ప్రజా తీర్పుకు ఉంచాలి.
అవినీతి, అక్రమాలను జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి.. ఎండగట్టాలి. ఇప్పటివరకు కేవలం విద్యా వ్యవస్థలో లోపాలపై చేసిన పోరాటం.. అదే స్ఫూర్తి తో.. అంతే శాంతియుతంగా అవినీతిపై పోరాటానికి దిగాలి. ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాల సంఘటనలను ఎండగట్టాలి. అదే సమయంలో రాజకీయాల్లోకి యువ నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. వారు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా, పారదర్శకతను కోరుకునే చదువుకున్న యువత రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించి నిర్ణయాధికార స్థానాల్లో కూర్చోవాలి.
సమయం ఆసన్నమైంది..
అవినీతిని ఒక ‘పరిపాలనా సమస్య’గా మాత్రమే చూడటం సరైంది కాదు. అది దేశ భవిష్యత్తును కొల్లగొడుతున్న ఒక ‘సామాజిక నేరం’. విద్య, డిజిట ల్ స్వేచ్ఛపై తమ ఆక్రోశాన్ని, ఆవేశాన్ని, సామర్థ్యాన్ని చూపిన జెన్- జీ, జెన్ -ఆల్ఫా తరం, ఇప్పు డు అవినీతిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరం నిశ్శబ్దాన్ని వీడి ప్రశ్నించడం ప్రారంభిస్తే తప్ప.. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థల్లో పేరుకుపోయి న అవినీతి, అక్రమాల సంస్కృతికి చరమగీతం పాడటం సాధ్యం కాదు!
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






