20 August, 2026 | 2:37 AM

జెన్ ఆల్ఫా గర్జన

20-08-2026 01:36 AM

పాఠశాలల విలీన నిర్ణయంపై భోపాల్‌లో రోడ్డెక్కిన విద్యార్థులు

భోపాల్, ఆగస్టు 19 : ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగి న జెన్- జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. జెన్ జీ పోరాటంతో యువత తమ శక్తిని దేశానికి చాటిచె ప్పింది. ఇప్పుడు జెన్‌జీ తర్వాతి తరం అయి న జెన్ ఆల్ఫా కూడా ఉద్యమ బాట పట్టింది. తమ పాఠశాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భోపాల్‌లో విద్యార్థు లు బుధవారం రోడ్డెక్కి గర్జించారు.

భోపాల్‌లోని రీజినల్ స్కూల్ విద్యార్థులు నిరసనకు దిగారు. డెమానిస్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్ (డీఎంఎస్)ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)లో విలీనం చేయాలన్న ప్రతి పాదనను వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తమ విద్యాసంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విద్యా ప్రయోగాల ప్రధాన లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ, విలీనాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్‌కే గుప్తాకు విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. డెమానిస్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూళ్లను రీజినల్ స్కూల్స్ అని కూడా పిలుస్తారు.

ఇవి 1965 డిసెంబర్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. భోపాల్, అజ్మీర్, మైసూ రు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాత్మక పాఠశాలలను ఏర్పాటు చేశారు. విద్యారంగంలో కొత్త బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం, వినూత్న విధానాలను అమలు చేసి వాటి ఫలితాలను పరిశీలించడం ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం.

డీఎంఎస్ స్కూళ్లను కేవీఎస్‌లో విలీనం చేస్తే వాటి ప్రత్యేక విద్యా విధానం, ప్రయోగాత్మక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు, పాఠశాలతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు. పరిపాలనా వ్యవస్థ మారడంతో విద్యా ప్రయో గాలు, పరిశోధనలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. నిరసన అనంతరం విద్యార్థులు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫె సర్ ఎస్‌కే గుప్తాకు అందజేశారు.

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..

రీజినల్ స్కూళ్లను కేవీఎస్‌లో విలీనం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జెన్‌ఆల్ఫా విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ప్రస్తుతం ఉన్న ప్రయోగాత్మక పాఠశాలల వ్యవస్థను కొనసాగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దానికి బదులుగా, ఆ సంస్థలను విద్యా నూతన ఆవిష్కరణ, పరిశోధన కేంద్రాలుగా బలోపేతం చేయాలని వారు అన్నారు.

తమ డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనను దశలవారీగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని, తమ సమస్యను సంబంధిత అధికారులు, శాఖల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్యా కేంద్రాలుగా కొనసాగుతున్న ఈ సంస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి ఏర్పాటుకు ఉన్న అసలు లక్ష్యాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రయోగాత్మక పాఠశాలల వెనుక ఉన్న అసలు ఆశయాన్ని నీరుగార్చకూడదని విద్యార్థులు పట్టుబడుతున్నారు. భోపాల్‌లో ప్రారంభమైన ఈ ఆందోళన.. రీజినల్ స్కూల్స్‌ను కేవీఎస్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై విద్యార్థుల నుంచి వ్యక్తమైన తొలి వ్యతిరేకత ఇదే కావడం గమనార్హం.