ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
మేడ్చల్ అర్బన్, మార్చి 5 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధి కింది బస్తి కామన్ కంతలో సురోళ్ల ప్రశాంతి కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నేత రామన్న గారి మణికంఠ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పేదల కోసం ఆలోచించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల జీవితాల్లో వెలుగు నింపాలన సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.
ఇది పేదలకు వరమని, ఇదేవిధంగా ఎన్నికల సమయంలో పేదల కోసం ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేసిందని ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పేద ప్రజలు ఆనందంగా ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వజ్రేశ్ యాదవ్, సుధీర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి తాను అడగగానే 60 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని మణికంఠ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మోనార్క్, సాయి, నవీన్, సాయిరాం, వినోద్, దను పాల్గొన్నారు.




