7 March, 2026 | 11:04 AM

వన్ హెల్త్ అంబులెన్స్‌లు ప్రారంభం

06-03-2026 02:40 AM

మేడ్చల్, మార్చి 5 (విజయక్రాంతి): హైదరాబాదు నగరంలో ఆపద సమయంలో క్షతగాత్రు లను, రోగులను మెరుగైన వైద్య సేవల కోసం త్వరగా ఆస్పత్రులకు తరలించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంబులెన్స్లను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.

మల్లారెడ్డి విశ్వవిద్యా పీఠ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అంబులెన్స్లకు జండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిన ఈ అంబులెన్సులలో రోగులకు, క్షతగాత్రులకు ఆస్పత్రికి చేరకముందే వీటిలోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయని నిర్వాహకులు తెలిపారు.

బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వానస్డ్ లైఫ్ సపోర్ట్ అత్యధిక పరికరాలు ఉన్నాయని, శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తారని తెలిపారు. షామీర్పేట్, మల్కాజిగిరి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బాచుపల్లి, మణికొండ, కెపిహెచ్బి, సికింద్రాబాద్, ఈసీఐఎల్, మియాపూర్, పంజాగుట్ట వంటి ప్రధాన నివాస, పారిశ్రామిక ప్రాంతాలలో ఈ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 9734108108 నెంబర్ కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ భద్ర రెడ్డి, వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.