30 May, 2026 | 2:39 AM

ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం

30-05-2026 02:02 AM
  1. నా సవాల్‌ను స్వీకరించే దమ్ముందా..?
  2. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడే దమ్ము లేక..హైదరాబాద్ ఇళ ్ల మీద కేటీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో మీరు పదేండ్లలో కట్టిన ఇళ కంటే, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇళ ్ల నిర్మించిందన్నారు. తొలి రెండున్నర సంవత్సరాలలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామని, జూన్1న మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నామి తెలిపారు.

హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు  నిర్మించబోతున్నామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘అవినీతి కేసుల నుంచి తప్పించుకో వడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరు. స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మీ సోదరి కవిత’ కూడా చెప్పారు అని పొంగులేటి గుర్తు చేశారు.

దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్ రూం ఇండ్ల వరకు.. అన్నీ మాటలు తప్ప, చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు..? అని ఆయన ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణంపై మరొక్కసారి సవాల్ విసురుతున్నా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే, ఎన్నికల్లో పోటీచేస్తా.. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి దూరం గా ఉంటారా..? దమ్ముంటే సవాల్‌ను స్వీకరిం చు కేటీఆర్ అని పొంగులేటి స్పష్టం చేశారు.