27 May, 2026 | 3:23 AM

ప్రతి కుటుంబానికి ‘ఇందిరమ్మ బీమా’

27-05-2026 12:00 AM
  1. జూన్ 2నుంచి అమల్లోకి..
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం 
  3. పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి 
  4. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలపైన సమీక్ష
  5. అధికారులకు దిశా నిర్దేశం

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తేనుంది. ఈ మేరకు  మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన క్యా బినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీని వాసరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఇందిరమ్మ బీమా పథకం విధివిధానాలు, ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ వేడుకల నిర్వహణపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు వివరాలు సేకరించాలి.

మిగిలిపోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలి. పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సర్వే పూర్తయిన ఇళ్లకు లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించనున్నారు. ఈ మేరకు అన్ని శాఖలు తమ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సమర్పించాలని అధికా రులను ఆదేశించారు.  

వేడుకలను ఘనంగా నిర్వహించాలి

‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ముగింపు వేడుకలను జూన్ 2 నుం చి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ప్రగతిని వారు సమీక్షించారు. వేడుకల సందర్భంగా నిర్వహించా ల్సిన కార్యక్రమాలపై చర్చించారు.  అన్ని శా ఖలు సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలని  స్పష్టం చేశారు.