27 May, 2026 | 2:25 AM

బాల్య వివాహాలతో బాలికల బతుకులు ఆగం

27-05-2026 12:00 AM

కోరుట్ల రూరల్ మే 26 (విజయ క్రాంతి):ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో మహిళ వారోత్సవంలో భాగంగా మెట్టుపల్లి ప్రాజెక్టు పరిధిలోని కోరుట్ల పట్టణంలో, మం డలంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం రోజున మెట్టుపల్లి ఐసిడిఎస్ సీడీపీఓ మనెమ్మ,జిల్లా బాల ల పరి రక్షణ విభాగ నుండి ఆరుట్ల రజిత ప్రజలకు, పెద్దలకి, కుశోర బాలికలకు, పిల్లలకు బాల్య వివాహాల పైన అవగాహన కల్పించారు. పిల్లలకి బాల్య వివాహ చట్టం- 2006, పోక్సో చట్టం -2012,మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు పై అవగాహన కల్పించడం జరిగింది.

బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయికి. 21 సంవత్సరంలోపు అబ్బాయికి. వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని .అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడునని .అదేవిధంగా బాల్యవివాహాల వల్ల పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని అలాగే ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రో త్సాహాలు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలు వర్తించవని తెలిపారు.

గ్రామపంచాయతీ పరిధిలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలను గుర్తించి, చర్చించి పిల్లలకు సమస్య ఉంటే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. మరియు బాలబాలికలు మత్తు కి బానిస అవ్వడం మరియు మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని అలాగే 18 సంవత్సరాల లోపు బాలబాలికలకి రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం చైల్ హెల్ప్ లైన్1098.పోలీస్ 100, సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బాల్య వివాహాలు లేని భారతదేశ కోసం ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సీడీపీఓ మనెమ్మ మరియు సూపెర్వైర్లి, సఖి లావణ్య హబూ నుండి హేమ మరియు అవుట్ రీచ్ వర్కర్ శేఖర్ మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు అయ్యాలు పట్టణ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.