27 May, 2026 | 2:24 AM

అవకతవకల వేటలో అధికారులు

27-05-2026 12:00 AM

క్షేత్రస్థాయిలో పరిశీలన వివరాల సేకరణ

మానకొండూరు, మే 26 (విజయక్రాంతి) :కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన అక్రమాలపై గ్రామస్థులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫి ర్యాదు పై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ మేరకు కరీంనగర్ జిల్లా డి ఆర్ డి ఏ అధికారులు, పూర్తి స్థాయి విచారణ నిర్వహించా లని ఆదేశించడంతో మంగళవారం ఎంపీడీవో వరలక్ష్మి జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో 2019 - 2025 సంవత్సరాల వరకు జరిగిన ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం, పరిపాలనా నిర్లక్ష్యంపై, గ్రామస్థులు ఇటీవల జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. గ్రా మానికి చేరుకున్న మండలస్థాయి అధికారుల బృందం, 20192025 సంవత్సరాల మధ్యకాలంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి క్యాష్బుక్ను అసలు నిర్వహించలేదని గుర్తించినట్లు తెలిసింది. అలాగే నర్సరీకి ఎర్రమట్టి తరలింపులో జరిగిన అవకతవకలు, ఈజీఎస్ నిధులను ఇతర పంచాయతీ ఖాతాలకు మళ్లించడం, స్మశానవాటిక నిర్మాణంలో వాస్తవానికి లేని గదులు, గోడల పనులకు బిల్లులు చూపించడం , తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు.

ఈ విచారణకు సంబంధించిన నివేదిక జిల్లా అధికారులకు సమర్పించిన అనంతరం, పూర్తి స్థాయి చర్యలు తీసుకునేలా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖను మరోసారి ఆశ్రయించాలని గ్రామస్థులు నిర్ణయించినట్లు సమాచా రం. ఎంపీడీవో వరలక్ష్మి , సర్పంచ్ పాకాల వందన రెడ్డి, ఎంపిఓ సాగి సతీష్రావు, ఇం చార్జి సెక్రటరీ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఏఈఈ వెంకటేశ్వర్లు, ఈజీఎస్, ఏపీఓ శ్రీనివాస్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సత్యానందం, మండల పరిషత్తు కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ భరత్ కుమార్ తదితరులు క్షేత్రస్థాయి పరిశీలనకు హాజర య్యారు.