వందన కటారియా రీఎంట్రీ..
న్యూఢిల్లీ: భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌కు బుధవారం 24 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. మిడ్ ఫీల్డర్ సలీమా టిటే జట్టును నడిపించనుండగా.. నవనీత్ కౌర్ డిప్యూటీ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన వందన కటారియా తుది జట్టులోకి రాగా.. డిఫెండర్స్ నిక్కీ ప్రధాన్, జ్యోతి ఛత్రీ, మిడ్ ఫీల్డర్ బల్జీత్ కౌర్, ఫార్వర్డ్ ప్లేయర్లు ముంతాజ్ ఖాన్, రుతజా దదాస్ జట్టులోకి ఎంపికయ్యారు. గోల్ కీపర్స్‌గా సవితా, బిచూ దేవిలు ఎంపికయ్యారు. బన్వరీ సోలంకి స్టాండ్ బై గోల్ కీపర్‌గా వ్యవహరించనుంది. ఢిపెండర్స్ అక్షత, జ్యోతి సింగ్, ఫార్వర్డ్ ప్లేయర్లు సాక్షి రానా, అన్నూ, సోనమ్‌లు స్టాండ్ బైగా ఉండనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న హాకీ ప్రొ లీగ్‌లో భారత్ ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీతో రెండేసి సార్లు మ్యాచ్‌లు ఆడనుంది.
భారత జట్టు:
గోల్ కీపర్స్: సవితా, బిచూ దేవి
డిఫెండర్స్: సుశీల చాను, నిక్కీ ప్రధాన్, ఉదితా, జ్యోతి, ఇషికా, జ్యోతి ఛత్రీ.
మిడ్ఫీల్డర్స్: వైష్ణవి విట్టల్, నేహా, మనీశా చౌహన్, సలీమా టిటే (కెప్టెన్), సునేలితా, లార్హేసియామి, బల్జీత్ కౌర్, షర్మిలా దేవి
ఫార్వర్డ్స్: నవనీత్ కౌర్ (వైస్ కెప్టెన్), ముంతాజ్ ఖాన్, ప్రీతి దూబే, రుతజా, బ్యూటీ డంగ్‌డంగ్, సంగీతా కుమారి, దీపికా, వందన కటారియా