calender_icon.png 31 January, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధినిధి పసిడి కాంతులు

30-01-2025 12:13:42 AM

38వ జాతీయ క్రీడలు

హల్దానీ: కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల సంచలనం ధినిధి దేశింగు 38వ జాతీయ క్రీడల్లో అదరగొట్టింది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ధినిది తాజాగా జరిగిన స్విమ్మింగ్ క్రీడలో తాను పోటీ పడిన మూడు కేటగిరీల్లోనూ స్వర్ణాలు కైవసం చేసుకుంది.

మొదట మహిళల 200 మీ ఫ్రీస్టుల్ ఈవెంట్‌లో పసిడి నెగ్గిన ధినిధి ఆ తర్వాత 100 మీ బటర్ ఫ్లు, 4x100 మీ ఫ్రీస్టుల్ విభాగాల్లోనూ స్వర్ణాలు గెలుచుకుంది. ధినిధి ప్రదర్శనతో కర్ణాటక జట్టు పట్టికలో టాప్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ 200 మీ ఫ్రీస్టుల్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.