22 April, 2026 | 1:56 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఇండియన్ సిల్క్ గ్యాలరీ--2025

30-11-2025 12:00 AM
  1. శ్రీనగర్ కాలనీలో సత్యసైనిగమగంలో ఏర్పాటు
  2. డిసెంబర్ 3 నుంచి 10 వరకు పట్టు ప్రదర్శన

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలోని సత్యసైనిగమగంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ- -2025 పేరుతో డిసెంబర్ 3 నుంచి 10 వరకు జరగనున్న పట్టు ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ కమిషనర్, అభివృద్ధి ప్రాం తీయ అధిపతి డాక్టర్ అరుణ్ కుమార్‌తో కలిసి రాష్ర్టపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీప్రియ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఆస్తా ఆవిష్కరించారు.

నిర్వాహకుల ప్రకారం, రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను జరుపుకోవడానికి ఈ ప్రదర్శనలో చేతివృ త్తుల వారు తయారు చేసిన ప్రత్యేక పట్టు ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. పట్టు ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా, దేశంలోని వివిధ నగరాల నుండి చేతివృత్తులవారు అందంగా చేతితో నేసిన చీరలు ఉంటాయని చెపుతున్నారు.

చేనేత ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించాలని, మహిళలు చేనేత వస్త్రాలు ధరించి మన భారతీయ వైభవాన్ని భావితరాలకు అందించాలని, మహిళలు పట్టు ప్రదర్శనలను ప్రోత్సహించాలని డాక్టర్ అరుణ్ కుమార్ కోరారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో వినియోగదారులకు నేరుగా చేనేత ఉత్పత్తులను అందిస్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిర్వాహకులు వినయ్ కుమార్, శ్రీనివాసరావు కృషిని వారు అభినందించారు.