27 August, 2026 | 6:14 PM

నేపాల్‌కు అండగా భారత్

27-08-2026 01:28 PM

నేపాల్ ఆకస్మిక వరదల్లో 177కి పెరిగిన  మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో బుధవారం ఆకస్మిక వరదలు(Nepal Floods) బీభత్సం సృష్టించాయి. నేపాల్ వరదల్లో ఇప్పటివరకు 177 మంది జల సమాధి అయ్యారు. సుమారు 750 మంది వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారని అధికారులు ప్రకటించారు. నేపాల్ -టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోశీ నదికి భారీగా వరద పోటెత్తింది. వరదల్లో వంతెనలు కొట్టుకుపోగా,  13 జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయి.

నేపాల్ కు అండగా భారత్

వరదల సంక్షోభ సమయంలో నేపాల్ కు భారత్ అండగా నిలిచింది. భారత్ నేపాల్(India Stands With Nepal) కు రెండు విమానాల్లో 47.5 టన్నుల సహాయ సామాగ్రిని ఖాట్మండుకు పంపించింది. వాయుసేనకు చెందిన రెండు సీ-130జే విమానాల్లో సామాగ్రి తరలించింది. సహాయ బృందాలు, ఆహారం, తాత్కాలిక షెల్టర్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంపులు, ఔషధాలు పంపినట్లు భారత్ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సాయం కోసం సామాగ్రి పంపించింది. భారత్ బృందాలు నేపాల్ లో సహాయ చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ తో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు  భారత విదేశాంగ శాఖ వెల్లడించింది