27 August, 2026 | 11:47 AM

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

27-08-2026 09:12 AM

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి తిరుపతికి(Vijayawada to Tirupati) వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఆటో రిక్షాను(Private bus collides with Auto) ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఏడుగురు మృతి చెందగా, నలుగురు పిల్లలతో సహా మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి (Government General Hospital) తరలించారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామవాసులుగా గుర్తించారు.

ప్రశాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గుంటూరు జీజీహెచ్‌లో ఇద్దరు, చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో(Chilakaluripet Government Hospital) ఒకరు మృతి చెందారు. మృతులను బొంత బాబు (62), బొంత మణెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), మరియమ్మ (45)లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.