14-02-2026 12:03:23 AM
ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్‌షిప్
హైదరాబాద్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్ షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 15-5 గోల్స్ తేడాతో లక్సంబర్గ్‌పై ఘనవిజయం సాధించింది. తొలి చక్కర్ నుంచే భారత ఆటగాళ్లు అదరగొట్టా రు. దూకుడుగా ఆడుతూ వరుస గోల్ న మోదు చేశారు. భారత జట్టు కెప్టెన్ యూస ఫ్ అజ్మి ఈ మ్యాచ్‌లో అత్యధికంగా ఆరు గోల్స్ కొట్టాడు.
అలాగే భారత్ తరపున చైతన్య కుమార్ 4 , కుమార్ విశాల్ సింగ్ 3, మహమ్మద్ నయీముద్దీన్ 1 గోల్ సాధించారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు చిన్నారి రైడర్లకు షో జం పింగ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే హైదరాబాద్‌లో తొలిసారి ఈ పోటీలు నిర్వహిస్తు న్న నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం ట్రాక్టర్ స్టంట్స్, లేజర్ షోతో పాటు మహిళా పోలో ప్లేయర్స్ తో ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. కాగా అంతర్జాతీయ అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హెచ్ పీఆర్ సీపై విదేశీ ప్లేయర్స్ ప్రశంసలు కురిపించారు.