6 June, 2026 | 2:38 AM

భారత జీడీపీ వృద్ధి రేటు 7.7శాతం

06-06-2026 12:00 AM
  1. గతేడాది కంటే 0.6 పెరుగుదల
  2.  ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 7.8 శాతం అంచనా

న్యూఢిల్లీ, జూన్ 5: భారత వృద్ధి రేటులో భారీగా పెరుగుదల నమోదైంది. 2025--26లో దేశ జీడీపీ 7.7% వృద్ధి చెందింది. అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకుని భారత్ ఆర్థికంగా వృద్ధి పథనంలో పయనిస్తోంది. గతేడాది కంటే మెరుగైన వృద్ధి రేటును సాధిం చింది. శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024--25లో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే, 2025--26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం అధిక వేగంతో వృద్ధి చెందింది.

2025--26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి--మార్చి కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు గణాంకాలు, కార్యక్ర మాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీ ఐ) తెలిపింది. ‘2024--25కి సంబంధించి మొదటి సవరించిన అంచనా (ఎఫ్‌ఆర్‌ఈ) ప్రకారం.. రూ.299.89 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీతో పోలిస్తే, 2025--26లో ‘వాస్తవ జీడీపీ’ (స్థిర ధరల వద్ద జీడీపీ) రూ.323.12 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచ నా అని ఆ శాఖ పేర్కొంది.

అలాగే, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ (నామినల్ జీడీపీ) 2024--25లో రూ.318.07 లక్షల కోట్లుగా ఉండగా, 2025--26లో అది రూ.346.36 లక్షల కోట్ల కు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది 8.9 శాతం వృద్ధి రేటును సూచిస్తుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్--జూన్) గణాంకాలు ఆగస్టు 31న విడుదల కానున్నాయి.