6 June, 2026 | 2:48 AM

బీజేపీకి పీఠం పక్కా

06-06-2026 01:11 AM

డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రంలో అభివృద్ధి

  1. హామీల అమలులో రాష్ట్ర సర్కార్ విఫలం 
  2. ధాన్యం కొనుగోళ్లలో అన్నీ ప్రగల్బాలే 
  3. చేతకాక కేంద్రంపై అబాండాలు
  4. రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానా లు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను చివరి గింజ వరకు కొంటామని ప్రగల్బాలు పలికి, కాంగ్రెస్ ప్రభు త్వం చివరకు కేంద్రంపై అబాండాలు మోపుతోందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన అనేక పథకాలను కేంద్రం ఎక్కడా వివక్ష చూపకుండా అమలుచేస్తున్నదని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. మహబూబాబా ద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగే బీజేపీ ప్రశిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రశిక్షణ శిబిరం ప్రాంగణంలో  మొక్కలు నాటి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల కాలంలో అవినీతి తప్ప ఏమి జరగలేదని, ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించిందన్నారు. 600 కోట్ల రూపాయలతో 300 పడకల ప్రభుత్వాసుపత్రి, బీబీనగర్‌లో ఎయిమ్స్, ములుగులో గిరిజన యూనివర్సిటీ, 32 జిల్లాలకు జాతీయ రహదారుల వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేసిందని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ వరంగల్, చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోల్లపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, నెల రోజులు జాప్యంచేశారని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి బాగా జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాల ని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషిచేయా లని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రావడం తథ్యమని, అందుకోసం ఇప్పటినుండే కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రచారం నిర్వహించాలని ఉద్బోధించారు. జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, నాయకులు కళ్యాణ్ నాయక్, రవి నాయక్, గువ్వల బాలరాజు, కట్ట సుధాకర్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి శిక్షణ శిబిరంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

పేదల సొంతింటి కలను దూరం చేస్తారా?

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం భూముల మార్కెట్ విలువలను పెంచు తూ తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్యత రగతి, పేదల సొంతింటి కలను దూరం చేసేలా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద ర్‌రావు శుక్రవారం ప్రకటనలో విమర్శించా రు. కేవలం రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే అని మండిపడ్డారు. ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని, ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలోకి నెడు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి శాస్త్రీయత లేకుండా భూముల విలువలను 50 శాతం నుండి 100 శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 శాతం పైగా పెంచ డం వల్ల సామాన్యుడు భూమి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా రిజిస్ట్రేషన్ ఫీజుల కోసమే లక్షలాది రూపాయలు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందనారు.

ఇప్పటి కే స్లాట్ బుక్ చేసుకుని, పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూ డా పెంచిన ధరలనే వర్తింపజేస్తామని చెప్పడం ఈ ప్రభుత్వ నిరం కుశత్వానికి, మొండి వైఖరికి పరాకాష్ట అని విమర్శించారు. పెంచిన భూముల మార్కెట్ విలువల వల్ల సామాన్యు లపై పడే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని సమీ క్షిం చాలని, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ వైఖరిని మా ర్చుకోకపోతే ప్రజల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు.