calender_icon.png 14 February, 2026 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కు బిగ్ షాక్

14-02-2026 02:05:13 PM

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్,బీజేపీ స్వతంత్ర

కౌన్సిలర్లు.. కాంగ్రెస్ క్యాంపులో కలకలం..

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మునిసిపల్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ క్యాంపు నుంచి 26 వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమార్ స్వామి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. 30వ వార్డు నుంచి గెలుపొందిన సుకేశిని భరద్వాజ్ తండ్రి మాజీ కౌన్సిలర్ బిజి శంకర్ సింగ్, 34 వార్డు బిజెపి నుంచి గెలిచిన కొక్కుల రామ్మూర్తి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమక్షంలో బీ ఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి కేటీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.

కాంగ్రెస్ క్యాంపులో కలవరం మొదలైంది.  28 వార్డు నుంచి గెలుపొందిన చిప్ప అర్చన చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా ఏడో వార్డు నుంచి దావ స్వాతి కూడా చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. చైర్మన్ గిరి పై కాంగ్రెస్లో పోటీ పెరగడంతో విభేదాలు ఒకసారిగా బగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుడు చిప్ప మనోహర్ కనుసన్నలోనే ఈ సమీకరణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య విభేదాలు కాంగ్రెస్ క్యాంపులో లుకలుకలు బయలుదేరాయి.

బెల్లంపల్లి  మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనూహ్యమైన సమీకరణలు కాంగ్రెస్ క్యాంపులో గుబులు రేపుతున్నాయి. అసమతి వాదులు బీ ఆర్ఎస్ గూటికి ఎంతమంది వెళ్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందనీ పరీక్షలకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాగ్రెస్ క్యాంపు వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరు ఏ క్యాంపు నుంచి ఉంటారో బయటికి వస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చైర్మన్ గిరి కోసం శరవేగంగా సమీకరణలు మారుతున్నాయి.