15 August, 2026 | 5:44 PM

ఖమ్మం కొండలరావుకి పలువురి ప్రశంస.. మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు

15-08-2026 04:51 PM

ఖమ్మం టౌన్ (విజయ క్రాంతి):  ఖమ్మం పట్టణం మధురనగర్ కాలనీ కి చెందిన మత్తి కొండలరావు ను జిల్లాలోని పలువురు అభినందించారు. శనివారం ములుగు లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క చేతుల  మీదుగా బెస్ట్ ఎంప్లాయి అవార్డు అందుకొన్నారు. ఈయన ఏటూరు నాగారం ఐటిడిఏ లో జేడీఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ఐటిడిఏ నుండి ఇద్దరు అధికారులకు ఈ అవకాశం దక్కింది. అందులో ఈయన ఒకరు. దింతో ఖమ్మం లోని పలువురు నాయకులు, డాక్టర్లు, పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిధిలు, కాపు సంఘం నాయకులు ఆయనకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ ఐటీడీఏ, పీవో లెనిన్ వత్సల్, ఐఏఎస్  వారి సూచనలతో పనిచేయడం ద్వారా తనకు ఈ అవార్డు రావడం జరిగిందని తెలిపారు.