15 August, 2026 | 4:55 PM

దేశ భవిష్యత్తుకు పునాదులు మీరే.... ఉన్నదులుగా ఎదిగితే దేశం అభివృద్ధి.!

15-08-2026 03:15 PM

బోథ్ ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తుకు విద్యార్థులే పునాది అని పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నతులుగా ఎదగాలంటే లక్ష్యంతో చదివి దేశం అభివృద్ధి కోసం పాటుపడాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వేదం పాఠశాలలో ఏర్పాటు అయిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర పొలాలు అందరికీ అందాలని 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుందంటే యువతరం కృషి ఎంతగానో ఉందన్నారు.

సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ సర్పంచ్ బి మల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అయినా ప్రైవేట్ పాఠశాలలు విద్యను అందించడంలో పోటీ పడుతున్న అన్నారు. అనేక మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ ఉన్నదులుగా ఎదిగారన్నారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు ప్రైవేటు పాఠశాలలు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న అన్నారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ పచ్చిపాల సంతోష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలకు పిల్లలను పంపేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ముత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని పలువురు అభినందించారు.