స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
దోమకొండ, ఆగస్టు 15 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమానికి దోమకొండ మండలానికి చెందిన మహిళా లబ్ధిదారులు తరలివెళ్లారు. దోమకొండ మండలం నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్‌ఐ అధికారులు, దోమకొండ హెడ్‌క్వార్టర్‌కు చెందిన ఇద్దరు జీపీ అధికారులు, రేషన్ డీలర్‌తో పాటు మహిళా లబ్ధిదారులు కామారెడ్డి కళాభారతికి చేరుకున్నారు. అధికారులు లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.






