15 August, 2026 | 5:35 PM

మహనీయుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం

15-08-2026 04:43 PM

 జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, 

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): మహనీయుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయం లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భావితరాలకు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెలియజేయాలన్నారు. సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలే ప్రధాన కారణమని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అంకితభావంతో పనిచేస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి పథకాలు ప్రశంస పత్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రత్యేక అభివృద్ధి సలహాదారు వి హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, డీసీఆర్‌బీ డీఎస్పీ గట్టుమల్లు, ఇన్‌స్పెక్టర్లు నరహరి, శ్రీధర్, సంపత్, మురళి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.