15 August, 2026 | 3:55 PM

పరిపాలనా భవనంలో జెండా ఎగురవేసిన ఉపకులపతి

15-08-2026 03:11 PM

ముకరంపుర, ఆగస్టు 15(విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పరిపాలనా భవన ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యా ప్రమాణాలు, క్యాంపస్ సౌకర్యాల లక్ష్యంగా శాతవాహన విశ్వవిద్యాలయం ఒక పరివర్తన దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరంగప్రసాద్,  ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీశైలం  ఉద్యోగులు, విద్యార్థులతో జాతీయ పతాకం ఎగరవేసారు.