3 June, 2026 | 6:57 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి అంకితం

03-06-2026 05:58 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతుల ఏర్పాటుకు అంకితం అవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కొత్తపేట గ్రామ నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు. దాంతోపాటు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని బాదనకుర్తి గ్రామంలో నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం చేసి గ్రామానికి ఎన్నో ఏళ్లుగా కొరతగా ఉన్న పాఠశాల భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.