31 May, 2026 | 2:15 AM

ఈ వారం వార్తల్లో..

31-05-2026 12:10 AM

బుడ్డోడు కాదు బుల్డోజర్

ఐపీఎల్‌లో ఈ సారి హీరో ఆఫ్ ది సీజన్  మాత్రం వైభవ్ సూర్యవంశీనే. బుమ్రా నుంచి కమిన్స్ వరకూ బౌలర్ ఎవరైనా ఉతికారేశాడు. అతన్ని ఔట్ చేసేందుకు ప్రతీ జట్టూ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయంటే ఎంతలా భయపెట్టాడో అర్థమవుతోంది. 16 మ్యాచ్‌లలో 237 స్ట్రుక్‌రేట్‌తో 776 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. వైభవ్ ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు.

అదిగో సీఎం కుర్చీ

నా పేరు డీకే శివకుమార్.. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం.. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు.. తరాలుతిన్నా తరగని ఆస్తి.. ఏం లాభం ? ఇప్పటివరకు సీఎం పదవి అధిష్ఠించనే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత సీఎం పీఠం సిద్ధూకు వెళ్లింది. రెండున్నరేళ్ల తర్వాత నా పరం అవుతుందను కుంటే.. జరగలేదు.. అయితేనేం.. సాధించుకున్నా.. జూన్ ౩న సీఎంగా ప్రమాణం చేయబోతున్నా..