ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతులు
20-07-2026 09:32 PM
గజ్వేల్: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు ప్రభుత్వం అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ లో గల బాలికల హాస్టల్లను వారు పరిశీలించారు. భోజనం వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అన్ని బాగున్నాయని చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






