21 July, 2026 | 3:53 PM

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

21-07-2026 09:12 AM

పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో దాడి

పుట్టినరోజు వేడుకల నెపంతో పిలిచి దాడి

హైదరాబాద్: హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య కలకలం రేపిందిపాత కక్షలతో రౌడీషీటర్ నందనవనం సూరి(Rowdy sheeter Suri) దారుణ హత్యకు గురయ్యాడు. మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్(Meerpet Police Station) పరిధిలోని టీకేఆర్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల నెపంతో పిలిపించి సూరిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు.

పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో దాడి

సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూరి మరణించాడు. భార్య, బావమరిది హత్య కేసుల్లో సూరి నిందితుడిగా ఉన్నాడు. సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి పరిధిలో పలు కేసులున్నాయి. సూరిపై నగర బహిష్కరణ అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ హత్యపై మీర్ పేట్ పోలీసులు(Meerpet Police) కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూరి హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ సూరిని ఎవరు హత్య చేశారు?

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ సూరిపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సూరి హత్య ఎలా జరిగింది?

పుట్టినరోజు వేడుకల నెపంతో పిలిపించి.. కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం.

RELATED ARTICLES.........

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా అవసరం

రౌడీ షీటర్లకు సీఐ కౌన్సెలింగ్

రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి

హత్య కేసులో రౌడీ షీటర్ కు జీవిత ఖైదు

నార్సింగిలో మైనర్ బాలికపై దాడి.. ముగ్గురు నిందితులు పరారీలో