కస్తూర్బాలో ఆషాడ మాసం గోరింటాకు వేడుకలు
20-07-2026 09:34 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సునీత, ఎస్ఓ అరుణ మాట్లాడుతూ... ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. గోరింటాకు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగకరమని తెలిపారు. వేడుకల్లో భాగంగా అందరూ కలిసి రోటిలో గోరింటాకును దంచి విద్యార్థినుల చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టారు. సంప్రదాయ పాటలు, సందడి మధ్య విద్యార్థినులు ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.






