20 May, 2026 | 5:22 PM

వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించాలి

20-05-2026 04:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్  మేడిపల్లిలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు . సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారము పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలను అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా  అర్హులైన పిల్లలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని  కోరారు. అదేవిధంగా ఎండలు పెరుగుతున్న దృష్ట్యా వడ దెబ్బ గురించి  ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.