16 July, 2026 | 12:35 AM

ఎమ్మెల్యేతో పొట్టు కూడా కాదు..మా జోలికొస్తే తాటతీస్తాం..

16-07-2026 12:20 AM

తాడ్వాయి, జూలై, 15( విజయ క్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు తో పొట్టు కూడా కాదని...మా జోలికి వస్తే తాటా తీస్తామని తాడ్వాయి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ముదాం నర్సింలు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచులతో కలిసి ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఎమ్మెల్యే కావాలని గ్రామాల లోని సర్పంచులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నారని విమర్శించారు.

ఆయన మా జోలికి రావద్దని కోరారు. సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి మాట్లాడుతూ.... తాడ్వాయి మండలంలో ఒకే ఒక సర్పంచ్ దేవాయియిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారని, మిగతావారు ఒక్కరు కూడా గెలవలేదని ఎద్దేవ చేశారు. గెలిచిన సర్పంచ్ గ్రామంలో ఏమి అభివృద్ధి పనులు చేశారో చూపించాలని కోరారు. సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరితే అభివృద్ధి జరుగుతుందని లేదంటే జరగదని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఆయన కోరారు.  బిఆర్ ఎస్ సర్పంచులు మంగారెడ్డి, చంద్రారెడ్డి, తాజోద్దీన్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు.