తుర్కపల్లిలో ఐమాక్స్ లైట్లు ప్రారంభం
28-08-2026 12:29 AM
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఐమాక్స్ లైట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గురువారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం లైట్లను స్వయంగా ఆన్ చేశారు. చౌరస్తా సుందరీకరణతో పాటు రాత్రివేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకు లైట్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్ర అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






