ఒలంపియా స్కూల్‌లో ఖోఖో పోటీలను తిలకిస్తున్న ఐజీ
- కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐజీ సందర్శన
- ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి
తూప్రాన్, ఆగస్ట్ 8(విజయక్రాంతి): తూ ప్రాన్‌లోని ఒలింపియా స్కూల్‌లో శనివా రం నిర్వహించిన ఖో-ఖో క్రీడా ప్రారంభోత్స వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ ల్టీజోన్I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడి, క్రీడల ప్రాధాన్యత ను వివరించారు. అనంతరం ఐజీ టోల్ ప్లాజా వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, నేషనల్ హైవే 44 జాతీ య రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పరిశీలించారు.
హైవేపై ట్రా ఫిక్ నియంత్రణ, కీలక ప్రాంతాల పర్యవేక్షణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం మనోహరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ను ఐజీ సందర్శించారు. గత కొంతకాలంగా ఉన్న పె ండింగ్ ఫైళ్లను నిశితంగా పరిశీలించారు. ప్ర జలకు ఎలాంటి సమస్యలున్నా విధి నిర్వహణలో ఎక్కడ లోపం ఏర్పడకుండా లా అండ్ ఆర్డర్‌ను తూచా తప్పకుండా పాటించాలని ఐజీ సూచించారు.






