ఓటరు జాబితాలో తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించి ఏవైన తప్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే గ్రామ సభలలో సంబంధిత అధికారుల దృ ష్టికి తీసుకురావాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. గురువారం శామీర్ పేట్ గ్రామంలో సర్ పై నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ హాజరై, మట్లాడతూ గ్రామసభను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఓటరు సవరణ పై ఏలాంటి సందేహాలు ఉన్న గ్రామ సభలలో నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్స్ బి ఎల్ ఓ లు వచ్చి నోటీస్ ఇస్తారని, ఓటరుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వగలిగితే పేరు ఫైనల్ జాబితాలో ఉంటుందని, ప్రతి ఒక ఓటరు బిఎల్ ఓలతో సహాకరించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు సవరణ జాబితాకు సంబంధించి 11 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఏది అందుబాటులో ఉందని చూసుకొని ఆ డాక్యుమెంట్స్ బిఎల్‌ఓకు ఇస్తే తప్పకుండా ఫైనల్ పబ్లికేషన్ చేసేటప్పుడు పేరు, కుటుంబ సభ్యులు వారందరి పేర్లు కూడా వస్తాయన్నారు.
కొంతమంది ఓటరు జాబితాలో ప్రస్తుత ఫోటో ఆప్ డేట్ కావడం లేదని తెలుపగా, కలెక్టర్ స్పందిస్తూ ఫైనల్ లిస్టులో ఫోటో సవరింపులు జరుగుతాయని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫార్మ్ 6, చనిపోయిన వాళ్లకు సంబంధించినది ఫార్మ్ 7, మీకు ఎటువంటి సవరణలు చేయాలన్నా అంటే పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ వ ంటి ఎలాంటి సవరణలు ఉన్న ఫార్మ్ 8 లో చేసుకోవాలన్నారు. అనంతరం ప్రక్కనే ఉన్న అంగన వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో ఎంత మంది పిల్ల లు ఉన్నారని, వారికి సరైన పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు.






