28 August, 2026 | 5:26 AM

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

28-08-2026 02:35 AM

మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పరిశీలన

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడ శ్రీ చక్ర కాలేజీ (టీసీఎస్ ఐఓఎన్ డిజిటల్ సెంటర్)లో ఈనెల 30న జరగనున్న నీట్ ప్రవేశ పరీక్ష(NEET Exam) కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రాజు, తహసీల్దార్ సునీతరెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి గురువారం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీని పరిశీలించారు.

అభ్యర్థులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.