6 May, 2026 | 4:01 AM

రైల్వే వంతెన పనులు ప్రారంభించకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా

06-05-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నాయకులు రాజీనామాలకు సిద్దమా

ఘట్‌కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్

ఘట్ కేసర్, మే 5 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయాలనే డిమాండ్ తో ఈనెల 11 తేదీన తలపెట్టిన అమరణదీక్ష జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు హామీతో వాయిదా చేసుకున్నట్లు ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ తెలిపారు.

మంగళవారం ఆయన తన అనుచరులతో కలిసి మాట్లాడుతూ అమరణదీక్ష, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని డిసిసి అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ కు స్థానికులు అల్టమేటం ఇవ్వడంతో ఆయన మంత్రితో చర్చించి పెండింగ్ నిధులు విడుదల చేయించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యే మల్లారెడ్డి ద్వారానే పెండింగ్ నిధులు మంజూరు చేస్తున్నారని సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.

20 రోజుల్లో నిధులు విడుదల చేయకుండా వంతెన పనులు ప్రభుత్వం ప్రారంబించకుంటే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి నిధులు తెప్పిస్తున్నారని  ప్రకటిస్తునందున బిల్లు విడుదల కాకుంటే పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉండాలని అబ్బసాని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆర్‌ఓబి విషయంలో పేరు కోసం ప్రజలను మభ్యపెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.