8 July, 2026 | 1:41 AM

తీవ్ర పని ఒత్తిడితో సింగిల్ విండో సీఈఓ అశోక్ గుండెపోటుతో ఆకస్మిక మృతి

08-07-2026 12:42 AM
  1. అధికారుల టార్గెట్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఒత్తిడే కారణం మృతిని భార్య అర్చన
  2. సహకార సంఘాల సిబ్బందిని వెంటాడుతున్న గుండెపోటు మరణాలు
  3. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సహోద్యోగుల డిమాండ్

మంథని, జూలై 7 (విజయక్రాంతి) :  గ్రామీణ రైతులకు, వ్యవసాయ రంగానికి అ హర్నిశలు సేవలందించే ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం సింగిల్ విండో ము ఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ, కార్యదర్శి) అశోక్ తీవ్ర గుండెపోటుతో ఆకస్మికం గా మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అటు ప్రభుత్వ అధికారుల నిర్దేశిత టార్గెట్లు, ఇటు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహణ, లోన్ రికవరీల ఒత్తిడి కారణంగా ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన అశోక్ తర్వాత ఒక్క సారిగా గుండెనొప్పి రావడంతో భారీ అర్చ న, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు.

ఊపిరిసల్పని విధులు.. ప్రాణాలు తీస్తున్న ఒత్తిళ్లు!

సహకార సంఘాల సిబ్బంది పరిస్థితి ప్ర స్తుతం ‘కత్తి మీద సాము’లా మారింది. నా లుగు విభిన్న ప్రభుత్వ శాఖల (సహకార, వ్య వసాయ, పౌరసరఫరాల, బ్యాంకు అధికారులు) సమన్వయంతో పాటు, స్థానిక రాజకీయ ఒత్తిళ్ల నడుమ వీరు నలిగిపోతున్నారు. క్యాలెండర్ నిండా సీజన్ల వారీగా టార్గెట్లు ఉండటం, ఏ ఒక్క రోజు కూడా వీకెండ్ సెల వు లేకుండా విధులు నిర్వహించాల్సి రావ డం వల్ల సిబ్బంది శారీరకంగా, మానసికంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్ర మంలోనే విధి నిర్వహణలో నిరంతరం సతమతమవుతూ, సకాలంలో విశ్రాంతి లేకపో వడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని సహోద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్యాక్స్ సిబ్బంది దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

సీఈఓ అశోక్ అకాల మృతి పట్ల తోటి సహకార సంఘాల కార్యదర్శులు, సిబ్బంది స్థానిక రైతాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సేవలో ఉంటూ, నిబంధనల ప్రకారం విధులను సక్రమంగా నిర్వహించే ఒక సమర్థుడైన అధికారిని కో ల్పోవడం సహకార రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు సహకార శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందిం చి, 

క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉన్న అదనపు పని భారాన్ని మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని,  మరణించిన సీఈఓ  అశోక్ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబంలో ఒకరికి ఉ ద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చే స్తున్నారు. మృతుడి భౌతికకాయానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సహకార సంఘా ల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిం చారు. వారి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.