ధాన్యం దింపడంలో వేగం పెంచాలి
30-05-2026 12:00 AM
నిర్మల్ మే 29 ( విజయక్రాంతి)వరి ధాన్యం రైస్ మిల్లు దింపడంలో వేగం పెంచాలని అవసరమైతే ఎక్కువ కూలీలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. శుక్రవా రం కడెం దస్తురాబాద్ మండలాల్లో గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు నవా బుపేట కడెం పెద్దూర్ గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిరోజు ఎన్ని లారీల ధాన్యం వస్తుంది ఎంత దించుకుంటున్నారు కూలీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీల కొడుతా లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కలెక్టర్ కిషోర్ కుమార్ డిఎస్‌ఓ రాజేందర్ డిఎం సివిల్ సప్లై సుధాకర్ స్థానిక మండల అధికారులు ఉన్నారు.






