శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ
ముకరంపుర,(విజయక్రాంతి): విశ్వవిద్యాలయ క్రీడా రంగంలో ఒక కీలక అడుగు పడింది. శాతవాహన క్రీడా మైదానంలో సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' (మానవ నిర్మిత కృత్రిమ క్రీడా మార్గం) నిర్మాణ పనులకు ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఈరోజు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు వారికి జాతీయ స్థాయి శిక్షణ అవకాశాలను కల్పించేందుకు ఈ అధునాతన సింథటిక్ ట్రాక్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, బలమైన యువతను దేశానికి అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.






