17 May, 2026 | 12:05 PM

ఐసిఏఆర్ ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్ కవర్స్ పంపిణీ

17-05-2026 10:38 AM

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించండి

వనపర్తి,(విజయక్రాంతి): భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐసిఏఆర్) రాజేంద్రనగర్ హైదరాబాద్ వారి సౌజన్యంతో టార్పాలిన్ కవర్స్ ను  రైతులకు పంపిణీ చేశారు. ఐసీఏఆర్, ఐఐఎంఆర్, ప్రధాన శాస్త్రవేత్త డా ఏ. కళైసేకర్,.డా. కె. శ్రీనివాస బాబు సూచన మేరకు వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో సర్పంచ్ పద్మా విష్ణు అధ్యక్షతన గ్రామ రైతులకు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిఏఆర్ సినియర్ టెక్నికల్ అసిస్టెంట్ జక్కుల భగవంతు యాదవ్, ఆధ్వర్యంలో 100 మంది ఎస్సీ సన్న, చిన్న కారు రైతుల కు శిక్షణ తో పాటు, రూ 3500 విలువైన తార్పాలిన్ కవర్స్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రైతులు చిరుధాన్యాలపై దృష్టి సారించాలని, పంట మార్పిడి, తోపాటు అధిక దిగుబడి అధిక లాభాలు కూడా అందుతాయని, అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా వారు కోరారు. గ్రామస్తులైన భగవంతు ఆ సంస్థలో పనిచేయడం వల్ల గ్రామానికి మేలు జరుగుతుందని,ఈ సందర్భంగా ఆయనను పలువురు కొనియాడారు.ప్రతి ఒక్కరు గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలని అప్పుడే ఉన్న ఊరు కన్నతల్లి రుణం తీసుకున్న వారవుతారన్నారు. అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని, అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని, వారు కోరారు.