పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా..
నూతన మండల అధ్యక్షుడు తిరుపతి
వెంకటాపూర్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నూతన మండల అధ్యక్షుడు రెడ్డి తిరుపతి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి రాజన్న, జిల్లా అధ్యక్షుడు దిలీప్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన పార్టీని విస్తరించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో మండల ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్, అధికార ప్రతినిధిగా రమేష్, కోశాధికారిగా రాజు, కార్యదర్శిగా సదాచారి, సంయుక్త కార్యదర్శిగా భూషణ్ చారి, ప్రచార కార్యదర్శిగా రాజ్కుమార్, మండల కార్యకర్తలుగా రామచంద్రు, నరేందర్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ ఉపాధ్యక్షురాలు సునీత, వినోద్, మనమ్మ, ఆజం షేక్, యాకన్న, వినీత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.






