17 June, 2026 | 8:36 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఎమ్మెల్యే సహకారంతో సేవకుడిగా పనిచేస్తా

23-02-2026 12:46 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మీలో ఒకడిగా ఉంటూ అందరి సంక్షేమం కోసం సేవకుడిగా పని చేస్తానని మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం 11వ డివిజన్లోని రాజీవ్ స్వగృహ, గొల్లబడ్డ తండా ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలవాసులు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి డిప్యూటీ మేయర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో డివిజన్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వము ప్రతి ఒక్కరి మేలుకోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా సమాచారం అందిస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని భరోసా కల్పించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారి ఎదుగుదల కోసమే నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు.