మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా
మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి
భూత్పూర్, మే 5: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ బాలకోటి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ తో కలిసి పూజలు చేసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏడవ వార్డులో రూ. 30 లక్షల నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసామన్నారు గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కృషి చేశారన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఏ సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, కౌన్సిలర్లు పద్మ, లత సూరన్న గారి, అన్నపూర్ణ, లాలూ నాయక్, చంద్రకళ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్, డాక్టర్ పాషా, మహబూబ్ పాషా, మనన్, డొకోర్ శంకర్, మట్టి ఆనంద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.






