8 July, 2026 | 6:48 PM

ఈ మోటార్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకోండి

08-07-2026 05:25 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి సంక్షేమ శాఖ 2026-27 సంవత్సరం ఈ బైక్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి దయానంద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ఈ బైక్ వాహనాలు అందించడం జరుగుతుందన్నారు. పట్టణం లో 2 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఆదాయం కలిగిన వారు అర్హతగా పేర్కొన్నారు. ఈనెల 18న సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకుని ఆడు కాపీలను అందించాలన్నారు. ఇతర వివరాలకు శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.