calender_icon.png 8 February, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకే నా జీవితం అంకితం

08-02-2026 01:34:50 AM

11వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి రాజుగౌడ్ 

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): మాదారం, దువ్వగుంట, మంత్రికుంట ప్రజలకే నా జీవితం అంకితమని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజుగౌడ్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాదారం, దువ్వగుంట వార్డులో తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. చేతిగుర్తుకు ఓటువేయాలని కోరారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో గ్రామంలో సీసీరోడ్లు, అండర్ డ్రైనేజి పనులను చేశామన్నారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గడ్డపోతారం  మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం యాదవ్, లక్ష్మణ్ యాదవ్, కిషోర్ సింగ్, అశోక్, లక్ష్మణ్ సింగ్, నరసింహ ముదిరాజ్ పాల్గొన్నారు.