09-02-2026 01:13:38 AM
8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలకోటి
భూత్పూర్, ఫిబ్రవరి 8: మున్సిపల్ పట్టణంలోని 8వ వార్డు నుంచి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న, చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి కోరారు. ఆదివారం ఇంటింటికి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు.
తాను పాలకుడిగా వస్తలేనని ఐదేళ్లు మీకు సేవకుడిగా వస్తున్నానని, 8వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తన సొంత నిధులతోనైనా 8వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఆడబిడ్డ పెళ్లిళ్లకు తన సొంత డబ్బుల నుంచి రూ.20 వేలు అందజేస్తానన్నారు. ఇస్తున్న హామీలను తప్పక అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ మంజూరు చేస్తానన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా వారికి అండగా ఉంటానన్నారు. ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఎనిమిదవ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరి శేఖర్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.