calender_icon.png 9 February, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదరించండి అభివృద్ధి చేస్తా!

09-02-2026 01:14:51 AM

నారాయణఖేడ్ 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రుక్మిణి గోపాల్‌రెడ్డి 

నారాయణఖేడ్, జనవరి 8: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రుక్మిణి గోపాల్ రెడ్డి ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళుతున్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ ఆధ్వర్యంలో వార్డును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఓటర్లను కోరారు.

తమ వార్డులు ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ యాదవ్, ఆరి ఫ్, దిల్దార్ ఖాన్, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, మహిళా నాయకులు శంకరమ్మ, శశికళ, శివ లీల, జ్యోతి, సరిత, తదితరులు పాల్గొన్నారు.