23 April, 2026 | 5:02 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

శంషాబాద్ ఎయిర్ పోర్టులో గంజాయి పట్టివేత

26-10-2025 03:50 PM

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం స్వాధీనం చేసుకుంది.  డీఆర్ఐ అధికారులు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఒక ప్రయాణీకురాలిని తనిఖీ చేశారు. ఆమె సామానులో ముద్ద రూపంలో ఆకుపచ్చ రంగు పదార్థం ఉన్న ప్యాకెట్లు దొరికాయి. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఆమె లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో సుమారు రూ.4.15 కోట్ల విలువైన 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకురాలిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.